HomeUncategorizedAssembly by-elections | గుజరాత్​లో బీజేపీకి షాక్​.. ఆమ్​ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపు

Assembly by-elections | గుజరాత్​లో బీజేపీకి షాక్​.. ఆమ్​ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Assembly by-elections | గుజరాత్​లో భారతీయ జనతా పార్టీకి (Bharatiya Janata Party) షాక్​ తగిలింది. రెండు స్థానాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగగా.. ఒకచోట గెలుపొందగా.. మరోచోట ఓటమిని మూటగట్టుకుంది. విసావదల్​ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్​ఆద్మీపార్టీ అభ్యర్థి (Aam Aadmi Party candidate) విజయం సాధించాడు. బీజేపీ అభ్యర్థి కిరీట్​ పాటిల్​పై ఆప్​ క్యాండిడెట్​ ఇటాలియా 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గోపాల్​కు 75వేల ఓట్లు రాగా, పటేల్​కు 58వేలు ఓట్లు వచ్చాయి. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) ఈ స్థానంలో ఆప్​ ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపేంద్ర రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నిక వచ్చింది. అయితే మరో అసెంబ్లీ స్థానం అయిన కాడిని బీజేపీ తిరిగి దక్కించుకుంది.

Assembly by-elections | నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఉప ఎన్నికల జరిగాయి. బెంగాల్, పంజాబ్, కేరళ, గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించారు. కాగా.. సోమవారం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

Must Read
Related News