HomeతెలంగాణTransformers | ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు

Transformers | ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Transformers | ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు కాపర్​ తీగలు, ఆయిల్​ చోరీ చేశారు. ఈ ఘటన మండలంలోని నల్లవెల్లి(nallavelli Village) గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లి గ్రామ శివారులోని పొలాల్లో శనివారం రాత్రి మూడు 25కేవీ ట్రాన్స్​ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. వాటిలోని కాపర్​వైర్లను, ఆయిల్​ను ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన రైతులు వెంటనే విద్యుత్​ అధికారులకు (Electricity Department) సమాచారం ఇచ్చారు.

Transformers | తరచుగా చోరీలు..

పొలాల వద్ద ట్రాన్స్​ఫార్మర్లకు ఎలాంటి రక్షణ ఉండకపోవడంతో దుండగులు వాటిని టార్గెట్​ చేస్తున్నారు. ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసం అయితే వాటిని తిరిగి పనిచేసే విధంగా చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వాటి మరమ్మతుల కోసం విద్యుత్​ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ట్రాన్స్​ఫార్మర్లకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.