అక్షర టుడే, ఇందూరు : MLA Prashanth Reddy | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీఆర్ఎస్ బలాన్ని దెబ్బతీయడానికే తమ కార్యకర్తలను అరెస్టులు చేసి భయపెడుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో (Party Office) ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపితే కావాలని అరెస్టులు చేస్తున్నారన్నారు.
MLA Prashanth Reddy | కేసీఆర్ నందినగర్‌లో ఉంటారని తెలిసీ..
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farmhouse)లో ఉన్నాడని తెలిసి కూడా కావాలనే నందినగర్ ఇంట్లో అర్ధరాత్రి నోటీసులు గోడపై అంటించడం కక్షపూరిత చర్యేనని ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలను మానసికంగా వేధించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. కానీ తాము మరింత రాటుదేలుతామని చెప్పారు.
MLA Prashanth Reddy | ఏ ప్రభుత్వంలోనైనా ఫోన్ ట్యాపింగ్..
ఏ ప్రభుత్వంలోనైనా ఇంటెలిజెన్స్ విభాగం (Phone Tapping) పనిచేస్తుందని, సంబంధిత అధికారులను కాకుండా కేసీఆర్‌పై కుట్ర పన్నడం సిగ్గు చేటన్నారు. అనంతరం నాలుగో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన నాయకులను పరామర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta), పార్టీ నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.