89
అక్షరటుడే, ఇందూరు: Ayyappa Swamy | ‘స్వామియే శరణమయ్యప్ప’ నామస్మరణతో ఇందూరు నగరం మార్మోగింది. అయ్యప్ప దేవాలయ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని అయ్యప్ప ఆలయం (Ayyappa temple) నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, పాత కలెక్టరేట్ చౌరస్తా, పోచమ్మ గల్లీ, గోల్ హనుమాన్, పెద్ద బజార్, గాజుల్ పేట్ మీదుగా రఘునాథ చెరువు వరకు శోభాయాత్ర కొనసాగింది.
Ayyappa Swamy | దారిపొడవునా రంగవల్లులు..
శోభాయాత్ర ఆద్యంతం దారి పొడవున రంగవల్లులు, ప్రసాద వితరణతో కోలాహలంగా మారింది. బొడ్డెమ్మ చెరువు వద్ద ఆలయ పూజారి శర్మ నేతృత్వంలో పంచామృతాభిషేకం చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta), ఆలయ ఛైర్మన్ భక్తవత్సలం, గుండయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
