అక్షరటుడే, నిజాంసాగర్: Akhanda Harinama Saptaham | పిట్లంలోని విఠలేశ్వరాలయం(Vithaleshwara Temple)లో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం(Akhanda Harinama Saptaham) శనివారం ముగిసింది. వారంరోజులపాటు ఆలయంలో హరినామ సంకీర్తనలతో భజనలు చేశారు. ముగింపు సందర్భంగా మహిళలు కళశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భజన వార్కారీలు, భక్తులు పాల్గొన్నారు.
