అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actor Shivaji | నటుడు శివాజీ మహిళలకు క్షమాపణ చెప్పారు. దండోరా సినిమా (Dandora Movie) ప్రీ రిలీజ్ ఇవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సారీ చెబుతు వీడియో విడుదల చేశారు.
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. మహిళల వస్త్రధారణ గురించి కామెంట్లు చేశారు. మంచి బట్టలు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లను ఉద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. యాంకర్ అనసూయ (Anasuya), సింగర్ చిన్మయ్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ (Women’s Commission) సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శివాజీ మహిళలకు క్షమాపణ చెప్పారు.
Actor Shivaji | మంచి చెప్పాలనే..
మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని శివాజీ అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని కోరారు. హీరోయిన్లు చీరలు కట్టుకు రావాలని, సామాన్లు కనపడే డ్రస్సులు వేసుకు రావద్దంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డ కారణంగా నాలుగు మంచి మాటలు చెబుతామని అనుకున్నాన్నారు. అయితే అసభ్య పదాలు వాడినట్లు చెప్పారు. తాన మాటలతో ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. తాను అమ్మాయిలను ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. హీరోయిన్లు బయటకు వెళ్లిన సమయంలో బట్టలు జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఉండవని చెప్పాలని తన ఉద్దేశం అని తెలిపారు. తన ఉద్దేశం మంచిదే కానీ రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడనని చెప్పారు.