Homeజిల్లాలుకామారెడ్డిkamareddy | గోరక్షక్ కార్యకర్తపై కాల్పులు జరిపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

kamareddy | గోరక్షక్ కార్యకర్తపై కాల్పులు జరిపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

గోరక్షక్ కార్యకర్తపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కామారెడ్డి జిల్లా గోరక్షక్ ప్రముఖ్ తులసీదాస్ డిమాండ్ చేశారు. మేడ్చల్​లో జరిగిన ఘటనపై గురువారం ఆయన స్పందించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: kamareddy | మేడ్చల్ జిల్లా (Medchal district) ఘట్​కేసర్​ మండలం పోచారం వద్ద గోరక్షక్ కార్యకర్తపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కామారెడ్డి జిల్లా గోరక్షక్ ప్రముఖ్ తులసీదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. సోను అలియాస్ ప్రశాంత్‌పై గన్‌తో కాల్పులు జరిపిన నిందితుడు ఇబ్రహీంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా గోవుల తరలింపు, గోవధకు పాల్పడుతున్న గూండాలపై తక్షణచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హైదరాబాద్‌లో (Hyderabad) మాత్రమే కాకుండా, వివిధ జిల్లా, మండలాల్లో అక్రమంగా గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్న ఇటువంటి గూండాలు అనేకమంది తయారవుతున్నారన్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్​ సంఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.