Homeజిల్లాలునిజామాబాద్​ABVP Nizamabad | కానిస్టేబుల్​ను హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలి

ABVP Nizamabad | కానిస్టేబుల్​ను హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలి

కానిస్టేబుల్​ను హత్యచేసిన నిందితుడిని ఉరితీయాలని ఏబీవీపీ ఇందూర్​ విభాగ్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు శనివారం పరిషత్ కార్యాలయంలో విభాగ్​ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: కానిస్టేబుల్ ప్రమోద్​ను (Constable Pramod) హత్యచేసిన నిందితుడు రియాజ్​ను ఉరితీయాలని ఏబీవీపీ (ABVP) ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్​లో ఉన్న పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడు రియాజ్ దొరికిన నేపథ్యంలో ప్రభుత్వం ఉరితీయాలన్నారు. అలాగే కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

భవిష్యత్తులో ప్రజలు, పోలీసులపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, కంఠేశ్వర్ జోనల్ ఇన్​ఛార్జి దుర్గాదాస్, గోపి, కార్తీక్, చంద్ర, అఖిలేష్, బాలకృష్ణ, మణికంఠ, శ్రేయస్, టోనీ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.