అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమృత బాబాయ్ శ్రవణ్‌కుమార్‌కు తుది విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇచ్చింది.
మిర్యాలగూడ (Miryalaguda)లో అమృత, ప్రణయ్ కులాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమృత కుటుంబ సభ్యులు ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ పరువు హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతి రావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అమృత బాబాయ్ శ్రవణ్‌రావు సైతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన నల్గొండ జిల్లా కోర్టు (Nalgonda District Court) నిందితులకు జీవిత ఖైదు విధించింది.
High Court | హైకోర్టులో సవాల్
తనకు విధించిన జీవిత ఖైదుపై శ్రవణ్‌రావు (Shravan Rao) హైకోర్టులో సవాల్ చేవారు. తుది విచారణ పూర్తయ్యే వరకు తన బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిందితుడి ఇప్పటికే జైలులో ఉన్న కాలం, ఆయన వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇచ్చింది. అయితే తాత్కాలిక బెయిల్ మాత్రమేనని స్పష్టం చేసింది. రూ.25 వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.