అక్షరటుడే, ఇందూరు: Padmashali sangham | నగరంలోని వినాయక నగర్ (Vinayak Nagar) మహాలక్ష్మి పద్మశాలి సంఘం (Mahalakshmi Padmashali Society) 46వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారాన్ని సంఘ భవనంలో శనివారం నిర్వహించారు.
అధ్యక్షుడిగా భత్తుల అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అప్పన్న గారి వెంకటేశం, కోశాధికారిగా చాట్ల రవీందర్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తర్ప మాజీ అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య, కొండ గంగాచరణ్, గౌరవ అధ్యక్షుడు చిలుక జగదీష్, మాజీ ప్రధాన కార్యదర్శి క్యాతం గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గజ్జల నాగేశ్వరరావు, బైస కృష్ణ, బిల్ల నారాయణ, శ్యామ్, పద్మ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.