అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ నగరంలో ఇటీవల ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ (football player Messi) పర్యటించిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌కు రేవంత్ తన మనవడితో వచ్చారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. వాటికి సీఎం కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి తన మనవడిని ఫుట్‌బాల్ కోసం తీసుకెళ్లానని తెలిపారు. తాము కేసీఆర్ కుటుంబం లాగా పబ్‌లు మొదలైన వాటి చుట్టూ తిరగడం లేదన్నారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని స్పష్టం చేశారు. తాను అతిథిగా మాత్రమే హాజరయ్యానని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ప్రకటనలు ఇచ్చిందని, దాని CSR ఫండ్ నుండి రూ.10 కోట్లు విరాళం అందించిందని తెలిపారు.
CM Revanth Reddy | ఆయనపై చర్యలు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో (Formula E car race case) దర్యాప్తు కొనసాగుతోందని సీఎం తెలిపారు. DoPT నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సంస్థలను విలీనం చేయడం ద్వారా పరిపాలనను సరళీకృతం చేయడానికి జీహెచ్ఎంసీ వార్డుల విభజన చేపట్టామన్నారు. దీంతో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి మేలు చేస్తుందని తెలిపారు.