ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | అదే మా ఓటమికి కారణం: అక్షర్ పటేల్

    IPL 2025 | అదే మా ఓటమికి కారణం: అక్షర్ పటేల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | బ్యాటింగ్ వైఫల్యమే తమ పతనాన్ని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)కు వరుసగా రెండో పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అక్షర్ పటేల్.. పవర్ ప్లేలో తమ ప్రదర్శన సరిగ్గాలేకపోవడంతోనే విజయాన్నందుకోలేకపోయామని చెప్పాడు.

    ‘పవర్ ప్లే(Power Play)లో మా ఆట సరిగ్గా లేదు. మేం బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడలేదు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా లేదు. అయినా మేం చాలా తేలిగ్గా వికెట్లు కోల్పోయాం. ఇలాంటి పిచ్‌లపై పవర్‌ప్లేలో బాగా ఆడటం చాలా ముఖ్యం. మా బౌలర్లు బాగానే బౌలింగ్(Bowling) చేశారు. కానీ, బ్యాటింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓడిపోయాం. బౌలింగ్‌లోనూ 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. సానుకూలాంశం ఏంటంటే.. పవర్ ప్లే తర్వాత కేకేఆర్ మేం చక్కగా కట్టడి చేశాం. బ్యాటింగ్‌లో ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు రాణించి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. విప్రజ్(Vipraj) బ్యాటింగ్ చేసే సమయంలో గెలుస్తామనే ఆశలు కలిగాయి. అషుతోష్ శర్మ(Ashutosh Sharma) రాణించి ఉంటే.. మా తొలి మ్యాచ్ తరహా ఫలితం రిపీట్ అయ్యేది.

    ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి గాయమైంది. బంతిని ఆపే ప్రయత్నంలో ప్రాక్టీస్ పిచ్‌పై డైవ్ చేయడంతో చర్మం ఊడిపోయింది. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్ హ్యాండిల్ ఆ ప్రదేశానికి తగలడంతో నొప్పి వచ్చింది. మా తదుపరి మ్యాచ్‌కు 3-4 రోజుల విరామం ఉంది. ఆ మ్యాచ్‌లోపు కోలుకుంటాను.’అని అక్షర్ పటేల్(Axar Patel)  ఆశాభావం వ్యక్తం చేశాడు.

    ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), రింకూ సింగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/43) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/41), అక్షర్ పటేల్(2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు.

    అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఫాఫ్ డుప్లెసిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), అక్షర్ పటేల్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు. అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ తీసారు.

    Latest articles

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    More like this