అక్షరటుడే, వెబ్‌డెస్క్: County Cricket | క్రికెట్‌లో ఏదైన జట్టు కేవలం మూడు పరుగులకే ఆలౌట్ కావడం అనేది ఎప్పుడైనా జరిగిందా? అనే సందేహం అందరిలో కలగడం సహజం. కానీ ఈ అరుదైన ఘట్టం ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో (Cricket) జరిగింది. దీనిపై క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చెషైర్ లీగ్ థర్డ్ డివిజన్ మ్యాచ్‌లో ఈ ఘోర ఫలితం నమోదైంది. ఈ మ్యాచ్ 2014లో హాస్లింగ్టన్ vs విర్రల్ (Haslington vs Wirral) క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగింది. టి20 ఫార్మాట్‌లో హాస్లింగ్టన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 108 పరుగులు చేసింది. అయితే లక్ష్యం చాలా తక్కువే అన్న ఉద్దేశంతో బరిలోకి దిగిన విర్రల్ జట్టు కేవలం 3 పరుగులకే ఆలౌట్ కావడం సంచలనం రేపింది.
County Cricket | ఇదేం బ్యాటింగ్..
జట్టు మొత్తం చేసిన 3 పరుగులు కాగా, ఒక పరుగు బ్యాటర్ (కోనర్ హాబ్సన్) బ్యాట్ నుంచి వచ్చింది. మిగిలిన రెండు పరుగులు లెగ్ బైస్ ద్వారా వచ్చాయి. మొదట్లో 6 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయింది విర్రల్ జట్టు. తొలి పది మంది బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు, చివరికి కోనర్ హాబ్సన్ మాత్రమే ఒక పరుగు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో (First Class Cricket) ఇప్పటి వరకు నమోదైన అతి తక్కువ స్కోరు: 6 పరుగులు (1810లో, ది బీ టీమ్ vs ఇంగ్లాండ్) , క్లబ్ క్రికెట్‌లో: 1913లో సోమర్సెట్‌లోని లాంగ్‌పోర్ట్ జట్టు 0 పరుగులకు ఆలౌట్ అయ్యింది
తాము 3 పరుగులకు ఆలౌట్ అయ్యామని ఒప్పుకున్న విర్రల్ క్రికెట్ క్లబ్ (Wirral Cricket Club), తన అధికారిక X ఖాతాలో ఫన్నీగా స్పందించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan), ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ లాయిడ్ మరియు ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్లను ట్యాగ్ చేస్తూ, కోచింగ్ కోసం సహాయం కోరారు. వారు “#WeNeedIt” అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించగా, ఇది వైరల్‌గా మారింది. ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు కూడా ప్రసిద్ధ కౌంటీ క్రికెట్ ఆడతారు. అయితే తాజా మ్యాచ్‌లో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, హాస్లింగ్టన్ (Hashington) మొదట బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డులో 108 పరుగులు చేసి, ప్రత్యర్థి జట్టుకు 20 ఓవర్లలో 109 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది.లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాల్ క్రికెట్ క్లబ్ మొదటి 6 ఓవర్లలోనే 8 మంది బ్యాటర్స్ వికెట్లు కోల్పోయింది.