అక్షరటుడే, ఇందూరు: Bc Sankshema Sangham | బీసీ రాష్ట్ర బంద్‌కు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని కేర్ కళాశాలలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్ ఆరంభం మాత్రమేనని రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదన్నారు.
అనంతరం విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్‌కు నివాళులర్పించారు. ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఆంజనేయులు, రవీందర్, శంకర్, వినోద్, అజయ్, శ్రీలత, విజయ్, చంద్రకాంత్, సాయి, చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్