అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు సీపీ సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. వినాయక నిమజ్జనం (Ganesh Immersion) ముగిసిన అనంతరం ఆయన ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన ఉత్సవాల వరకు ప్రజలు సహకరించారన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకున్నారని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు వేల విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు.
గణేశ్ నిమజ్జనం సదర్భంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. బాసర, ఉమ్మెడతో పాటు మిగతా ప్రాంతాల్లో సైతం నిమజ్జన కోసం పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. నగరంలో సార్వజనిక్ గణేశ్ మండలి, గణేశ్ మండపాల నిర్వాహకుల సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉన్న ఆయా శాఖల అధికారులను ఆయన అభినందించారు.