HomeUncategorizedShashi Tharoor letter | ధ‌న్య‌వాదాలు మోదీజీ.. కేంద్రానికి శ‌శిథ‌రూర్ లేఖ‌

Shashi Tharoor letter | ధ‌న్య‌వాదాలు మోదీజీ.. కేంద్రానికి శ‌శిథ‌రూర్ లేఖ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shashi Tharoor letter | కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి శ‌శిథ‌రూర్ (former minister shashi tharoor) కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే బాధ్యతను తనపై విశ్వాసంతో అప్పగించినందుకు ప్రధాని మోదీకి (prime minister modi) కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ (letter) రాశారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళ్లాలన్న కృతనిశ్చయం ప్రధాని నిర్ణయంలో ప్రతిఫలిస్తోందని వ్యాఖ్యానించారు. సంక్లిష్ట ఆంగ్ల భాషలో లేఖ రాసిన శశి థరూర్ (shashi tharoor).. ప్రస్తుత పరిస్థితులను ప్రతిఫలించేలా పదజాలాన్ని ఎంచుకున్నట్టు వివరించారు.

Shashi Tharoor letter | మోదీపై ప్ర‌శంస‌లు..

విదేశాంగ శాఖ విధానాన్ని ప్ర‌పంచ దేశాల‌కు వివ‌రించే బృందానికి త‌న‌ను ఎంపిక చేయ‌డంపై థ‌రూర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీపై (modi) ప్ర‌శంస‌లు కురిపించారు. తన తార్కిక, భాషా పటిమకు అనుగుణంగా ప్రధాని మోదీ (PM modi) ఎంపిక ఉందని థ‌రూర్ వ్యాఖ్యానించారు. విమర్శకులను తికమక పెట్టేలా ఉన్న ప్రధాని నిర్ణయం అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ప్ర‌శంసించారు. మిలిటరీ చర్యల (military actions) తర్వాత భారత్ వ్యూహాత్మక అవసరాలను ప్రపంచ వేదికలపై వివరించేందుకు తనను, ఇతర ఎంపీలను మోదీ ఎంపిక చేశారన్నారు. స్వతంత్ర అభిప్రాయాలున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుందన్న రాజకీయ సంకేతం (political signal) కూడా ఇందులో ఇమిడి ఉందని వివ‌రించారు. దౌత్యపరంగానూ ఇది తగిన చర్య అని అభిప్రాయపడ్డారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే బాధ్యతను తనపై విశ్వాసంతో అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Shashi Tharoor letter | భార‌త వాణిని వినిపిస్తా..

వివిధ దేశాల వారికి చేరేలా భారత వాణిని తగిన రీతుల్లో వినిపిస్తానని మాటిచ్చారు. ఈ మిషన్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ భారతదేశ (india) ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన చర్యకు అదే స్థాయిలో సంక్లిష్ట భాషతో జవాబిచ్చానని శశిథరూర్ (shashi tharoor) అన్నారు. భారత్ ఉద్దేశాలు, ఆందోళనను ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేలా తన దౌత్య పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలతో వెల్లడిస్తానన్నారు. ఆంగ్ల భాషపై ఇంగ్లీష్ సాహిత్యవేత్తలతో సమానమైన పట్టున్న థరూర్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట ఆస‌క్తిక‌ర చర్చకు దారి తీసింది.