అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thammudu trailer | టాలీవుడ్ హీరో నితిన్ (hero Nithin) ఒకప్పుడు వరుస హిట్స్ తో తన అభిమానులని ఎంతగానో అలరించేవారు. కాని ఇప్పుడు ఆయనకి సక్సెస్‌లు కరువయ్యాయి. చివరి చిత్రం రాబిన్ హుడ్ (Rabinhood) కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘తమ్ముడు’. అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ (Laya) కీలక పాత్రలో నటిస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Thammudu trailer | హిట్ పక్కా..
‘తమ్ముడు’ (Thammudu) ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో కనిపిస్తుంది. అక్కకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు తమ్ముడు చేసిన యుద్ధమే ఈ చిత్ర కథగా మనముందుకు రాబోతున్నట్లు ఈ ట్రైలర్ (Trailer) చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నితిన్ (Nirthin) మరోసారి పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మీ అక్కను చూసావా.. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారెక్టర్ మాత్రం లూస్ అవ్వలేదు అంటూ వర్ష బొల్లమ్మ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలయ్యింది. అక్కగా లయ కనిపిస్తుంది. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. అక్క ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తమ్ముడు సిద్దమయ్యినట్లు ట్రైలర్లో చూపించారు.
మాట కోసం తమ్ముడు ఎన్ని కష్టాలను దాటాడు..? ఎంతమంది విలన్స్ తో పోరాడాడు..? చివరకు అక్క ఇచ్చిన మాటను నిలబెట్టాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు (Dil Raju), శిరీష్‌లు (Shirish) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కాంతారా’ చిత్రానికి తన అద్భుతమైన సంగీతంతో ప్రాణం పోసిన అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అక్కా-తమ్ముడు సెంటిమెంట్ (brother-sister sentiment) కూడా పుష్కలంగా ఉన్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్‌లోని పలు డైలాగులు కూడా బాగా పేలాయి. దీంతో ఈ సినిమాతో నితిన్ సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.