అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thalliki Vandanam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో(Bank Accounts) నేరుగా ఆర్థిక సాయం జమ అవుతోంది.
పథకంలో నిధుల పంపిణీ ఇలా జరుగుతుంది. మొత్తం రూ. 15 వేల రూపాయలలో రూ. 13 వేలు విద్యార్థి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మిగిలిన రూ. 2 వేలు ఆయా పాఠశాలల మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని ఖాతాకు పంపించబడతాయి.
Thalliki Vandanam | సహాయం పొందే తల్లుల వివరాలు:
- ఒక్క విద్యార్థి తల్లి – రూ. 13,000
- ఇద్దరు విద్యార్థుల తల్లి – రూ. 26,000
- ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి – రూ. 39,000
- నలుగురు పిల్లలు ఉన్న తల్లి – రూ. 52,000
ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ మందికి ఈ నిధులు జమ కాగా, కొన్ని కారణాల వల్ల అర్హత కలిగి ఉన్నప్పటికీ కొన్ని తల్లులకు నిధులు అందలేదు. అయితే, అటువంటి పెండింగ్ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఉండవల్లిలో ఉన్న తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “తల్లికి వందనం”(Thalliki Vandanam) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని ఆమోదించి, చివరి విడతగా రూ. 325 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) నిధులను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల భూసేకరణకు దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఫ్రీ స్కూల్ విధానాలను అధ్యయనం చేసి ఉత్తమ విధానం రూపొందించాలన్నారు. సైన్స్, స్పోర్ట్స్ ఫెయిర్‌లను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలన్నారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా అసెంబ్లీలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్థులను ఎంపిక చేయాలని స్పీకర్ అనుమతితో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర విద్యా రంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముందుకెళ్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.