Homeతాజావార్తలుTGS RTC | టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక యాప్‌ ద్వారా డిజిటల్ పాస్‌లు, టికెట్లు...

TGS RTC | టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక యాప్‌ ద్వారా డిజిటల్ పాస్‌లు, టికెట్లు అందుబాటులోకి!

ప్రస్తుతం ప్రజలు డిజిటల్‌ పేమెంట్లను ఎక్కువగా వాడుతున్నారు. ప్రయాణాన్ని సౌకర్యవంతం చేయడానికి మీ టికెట్​ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGS RTC | తెలంగాణలో Telangana బస్సు ప్రయాణికులకు మరింత సులభతరం అయ్యేలా టీజీఎస్‌ఆర్టీసీ (Telangana State Road Transport Corporation) మరో నూతన సేవను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపై ప్రయాణికులు తమ మొబైల్‌ఫోన్‌లోని ‘మీ టికెట్’ యాప్ ద్వారా RTC టికెట్లు, నెలవారీ పాస్‌లు పొందే అవకాశం ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ శాఖ (ESD) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మీ టికెట్’ యాప్‌ ద్వారా త్వరలో ఇంటర్‌సిటీ బస్సులు, డిజిటల్ బస్ పాస్‌లు (QR కోడ్ ఆధారిత) అందుబాటులోకి రానున్నాయి. ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికులు ఇకపై కౌంటర్ల దగ్గర లైన్లలో వేచి చూడ‌న‌క్క‌ర్లేదు.

TGS RTC | చింతించ‌న‌క్క‌ర్లేదు..

గంటల తరబడి వేచి ఉండకుండా, టికెట్ల కోసం చిల్లర సమస్యలు ఎదుర్కొనకుండా, సులభంగా తమ మొబైల్‌ఫోన్‌లోనే టికెట్లు, పాస్‌లు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. నిత్యం బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు లాంటి వారికిది నిజంగా ఎంతో ఉపయోగకరం. టికెట్ కొనుగోలు కోసం కండక్టర్‌తో చర్చలు లేకుండా, QR స్కాన్‌తోనే QR Scan ప్రయాణం చేయవచ్చు. మీ సేవా కమిషనర్ రవికిరణ్ ప్రకారం, ఈ సాంకేతిక పరిష్కారం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది, రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరిస్తుంది.

ఇవి ఏ బస్సులకు అందుబాటులోకి వస్తున్నాయంటే… ‘మీ టికెట్’ యాప్‌ ద్వారా సాధారణ బస్సులు, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (AC), పుష్పక్ AC బస్సుల్లో టికెట్లు, పాస్‌లు పొందవచ్చు. జనవరి 9, 2025న ప్రారంభమైన ఈ యాప్‌లో ఇప్పటికే 220కి పైగా పర్యాటక సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 98 అటవీ ప్రదేశాలు, 52 బోటింగ్ సెంటర్లు, 16 దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు RTC బస్సు సేవలు కూడా చేరుతున్నాయి. ఈ కొత్త సేవలకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ TGSRTC అధికారులు తెలిపారు. మొదటగా హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యే ఈ సౌకర్యం, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.