అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGSRTC | నిజాయితీ చాటుకున్న ఓ ఆర్టీసీ కండక్టర్ను ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) సన్మానించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – అచ్చంపేట ఆర్టీసీ బస్సులో rtc bus ఈనెల 26న రూ.13 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదును ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్నాడు. ఇది గమనించిన అచ్చంపేట డిపోకు acchampet depo bus చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు బ్యాగును ప్రయాణికుడికి అందించి తన నిజాయితీ చాటుకున్నాడు. దీంతో ఆయనను హైదరాబాద్లోని బస్ భవన్లో bus bhavan Hyderabad ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం సన్మానించారు.
