TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ‘మీసేవా మొబైల్ యాప్’ ద్వారా TGSRTC బస్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. యాప్​ ద్వారా టికెట్ బుక్​ చేసుకునే సౌకర్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ‘మీ సేవా – మీ టికెట్​’ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ‘మీసేవా మొబైల్ యాప్’ ద్వారా TGSRTC బస్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

యాప్​ ద్వారా టికెట్ బుక్​ చేసుకునే సౌకర్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ‘మీ సేవా – మీ టికెట్​’ (‘MeeSeva – MeTicket’) యాప్​ ద్వారా టికెట్లతో పాటు అనేక రకాల సేవలను ప్రయాణికులు పొందవచ్చు. సిటీ బస్ పాస్‌లు, T-24 టిక్కెట్ల డిజిటల్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ OPRS (ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) సేవలను మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానిస్తుంది. దీంతో ప్రయాణికులు సుదూర, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చు.

TGSRTC app ticket booking | యాప్​లో ఉన్న సేవలు

మొత్తం OPRS సేవలు 1,710. రోజుకు 13 వేల టికెట్లు బుక్​ చేసుకునే అవకాశం ఉంది. బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, వరంగల్ వంటి ముఖ్య నగరాలకు టికెట్లను ఈ యాప్​ ద్వారా బుక్​ చేసుకోవచ్చు.

TGSRTC app ticket booking | డిజిటల్ సిటీ బస్ పాస్‌లు

హైదరాబాద్ (Hyderabad) నగర ప్రయాణికుల కోసం ఐదు కేటగిరీల నెలవారీ సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయి. పాస్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు. నెల వారి పాస్​ల ధరలు ఇలా ఉన్నాయి. ఆర్డినరీ పాస్ రూ.1,400, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600, మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800, గ్రీన్ మెట్రో లగ్జరీ A/C పాస్ – రూ.2,200, పుష్పక్ A/C పాస్ రూ.5,000గా ఉంది. ఆయా పాస్​లను యాప్​ ద్వారా ప్రయాణికులు బుక్​ చేసుకోవచ్చు.

TGSRTC app ticket booking | T-24 టికెట్

గ్రేటర్ హైదరాబాద్ (జంట నగరాలు) జోన్ కోసం MeTicket మొబైల్ యాప్‌లో కూడా T-24 టికెట్ విలీనం చేశారు. T-24 టికెట్ అనేది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్,. ఈ టికెట్ బుక్​ చేసుకుంటే.. 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...