TGSPDCL WhatsApp Services | వాట్సాప్​లో విద్యుత్​ శాఖ సేవలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSPDCL WhatsApp Services | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సైతం అప్​డేట్ అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు వాట్సాప్​లో సేవలు అందిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలో విద్యుత్​ శాఖ (Electricity Department) చేరింది. విద్యుత్ వినియోగదారులు ఫోన్ల ద్వారా కీలక సేవలను తక్షణమే పొందేందుకు వీలుగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) WhatsApp చాట్‌బాట్‌ను ప్రారంభించింది. డిజిటల్ గవర్నెన్స్​లో భాగంగా విద్యుత్ సేవలను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSPDCL WhatsApp Services | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సైతం అప్​డేట్ అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు వాట్సాప్​లో సేవలు అందిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలో విద్యుత్​ శాఖ (Electricity Department) చేరింది.

విద్యుత్ వినియోగదారులు ఫోన్ల ద్వారా కీలక సేవలను తక్షణమే పొందేందుకు వీలుగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) WhatsApp చాట్‌బాట్‌ను ప్రారంభించింది. డిజిటల్ గవర్నెన్స్​లో భాగంగా విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలు చేపట్టింది. వినియోగదారులు 8712441912 నంబర్‌ను సేవ్ చేసి, WhatsAppలో “హాయ్” అని మెసేజ్​ పంపడం ద్వారా విద్యుత్ సేవలను పొందవచ్చు.

TGSPDCL WhatsApp Services | ఈ సేవలు పొందవచ్చు

వాట్సాప్​ ద్వారా వినియోగదారులు విద్యుత్ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. బిల్లింగ్ (Billing) వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. విద్యుత్ సరఫరా స్థితిపై అప్​డేట్​లు తెలుసుకోవచ్చు. వేగంగా సమస్యలను పరిష్కరించడం, కస్టమర్ కేర్ సెంటర్లకు భౌతిక సందర్శనలు, దీర్ఘకాలిక కాల్‌ల అవసరాన్ని తగ్గించడానికి దీనిని తయారు చేశారు. వాట్సాప్ ఆధారిత ప్లాట్‌ఫామ్ వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా విద్యుత్ సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy College Land Dispute | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర...

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...