అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGPOATG | నిజామాబాద్ జిల్లా Nizamabad district జీపీవోల సంఘం నూతన కమిటీని తాజాగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్, చిరంజీవి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. నిజామాబాద్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సంగేమ్ పృథ్వి రాజ్, అధ్యక్షుడిగా కిషన్ గౌడ్ పరకాల, ప్రధాన కార్యదర్శిగా నీరడి గంగాధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బొమ్మెన దీప, కోశాధికారిగా నల్ల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా నాంది శ్రీనివాస్, కొమ్ము అశోక్, మీడియా ప్రతినిధిగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు.
గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. వాస్తవానికి గతంలో జీపీవోలు(గతంలో వీఆర్వోలు) సహా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు అంతా ట్రెసా కింద పనిచేసేవారు. కానీ, తాజాగా ఎన్నుకున్న కమిటీ ట్రెసాకు ఏ మాత్రం సంబంధం లేకపోవడం, ట్రెసా బాధ్యులకు కనీస సమాచారం లేకపోవడం గమనార్హం.
TGPOATG | లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో..
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల revenue employees సంఘంలో లచ్చిరెడ్డి గతంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కాగా, రాష్ట్రస్థాయిలో ఒకరిద్దరు నాయకులు లచ్చిరెడ్డిని పక్కన పట్టి తమ పె త్తనాన్ని చెలాయిస్తున్నారు. దీంతో లచ్చిరెడ్డి నాయకత్వంలో జీపీవోలతో కొత్త సంఘం ఏర్పాటుకు తెర తీశారు. ప్రస్తుతం ఏర్పడిన టీజీపీవోఏటీజీ లచ్చిరెడ్డి నాయకత్వంలో పనిచేయనుంది. నిజామాబాద్ జిల్లాలో 300 పై చిలుకు జీపీవోలు ఉండగా.. 250 కి పైగా ఈ సంఘానికి మద్దతు తెలపడంతోపాటు సంఘంలో చేరినట్లు సమాచారం.
TGPOATG | అతగాడి వ్యవహారశైలినే..
నిజామాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో గత దశాబ్దకాలంగా ఏకచత్రాధిపత్యం నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరు అన్నీ తానై వ్యవహరించడమే కాకుండా.. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా నడిపిస్తున్నాడు. ఐఏఎస్ స్థాయి అధికారులు, ఆర్డీవోలు తన గుప్పిట్లో ఉన్నట్లు జిల్లా మొత్తంపై ఆజమాయిషీ చెలాయిస్తున్నాడు. ప్రత్యేకించి ఓ ఐఏఎస్ అధికారి హయాంలో ఇతగాడు చేసిన భూ కుంభకోణాల వల్ల పలువురు కిందిస్థాయి అధికారులు బలయ్యారు. ఇతగాడు మాత్రం యూనియన్ ముసుసుగులో అందలమెక్కాడు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతోపాటు, ప్రస్తుత కాంగ్రెస్ అధికార పాలనలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగి వేసారిపోయిన కిందిస్థాయి రెవెన్యూ ఉద్యోగులు రెండుగా చీలిపోయి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అధికారులు సైతం మరో సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.