HomeUncategorizedTG PGECET | విడుదలైన టీజీ పీజీఈసెట్‌ 2025 ఫలితాలు

TG PGECET | విడుదలైన టీజీ పీజీఈసెట్‌ 2025 ఫలితాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TG PGECET | తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (PGECET) – 2025 ఫలితాలు గురువారం రిలీజ్​ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (State Council of Higher Education) ఫలితాలను విడుదల చేసింది. అలాగే ర్యాంకు కార్డును అందుబాటులో ఉంచింది. జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో జూన్‌ 16 నుంచి 19వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు జరిగాయి. పీజీఈసెట్‌ ద్వారా 2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌–డి తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. కింది లింక్​ను క్లిక్​ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

https://pgecet.tgche.ac.in/TGPGECET/PGECET_Get_Result.aspx