HomeతెలంగాణTG High Court | బాధితురాలి ఏకాంత సాక్ష్యమే సత్యం కాదు.. అత్యాచారం కేసులో హైకోర్టు...

TG High Court | బాధితురాలి ఏకాంత సాక్ష్యమే సత్యం కాదు.. అత్యాచారం కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: TG High Court | అత్యాచార కేసుల్లో బాధితురాలి ఏకాంత సాక్ష్యమే పూర్తి సత్యంగా పరిగణించలేమని, ఆమె సాక్ష్యాన్ని నిర్ధారించే వైద్యపరమైన ఆధారాలు ఉండాల్సిందేనని హైకోర్టు High Court తేల్చి చెప్పింది.

ఈ కేసుల్లో అత్యంత విశ్వసనీయమైన సాక్ష్యం ఒక్కటి ఉన్నా కూడా మిగతా ఆధారాలతో సంబంధం లేకుండా శిక్ష వేయవచ్చని స్పష్టం చేసింది. హైదరాబాద్ Hyderabad కిషన్​బాగ్​ Kishanbagh కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్​ఖాన్​కు నాంపల్లి కోర్టు Nampally court అత్యాచారం కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను ఈ సందర్భంగా హైకోర్టు రద్దు చేసింది.

ఇర్ఫాన్ ప్రేమ పేరుతో దగ్గరై, తనపై లైంగిక చర్యకు పాల్పడినట్లు ఓ యువతి 2009లో ఫిర్యాదు చేయగా.. బహదూర్​పురా Bahadurpura పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఎంఎస్ కోర్టు నిందితుడిగా పరిగణించబడే ఇర్ఫాన్​కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

TG High Court | ఆరు నెలల తర్వాత ఫిర్యాదు..

కాగా, ఈ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇర్ఫాన్​ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జే శ్రీనివాసరావు ఈ కేసు విషయమై వ్యాఖ్యానించారు.

నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న యువతి.. 2008 నవంబరులో ఇంటి కొచ్చి భయపెట్టి లైంగిక చర్యకు పాల్పడినట్లు 2009 ఏప్రిల్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఫిర్యాదు చేయడం వల్ల వైద్యపరీక్షల్లో ఇరువురికి 18 ఏళ్లు దాటిన విషయం తప్ప మరో ఆధారం లభించలేదని పేర్కొన్నారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయించడంలో జాప్యంపై సరైన వివరణ లేకపోవడంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలు లేవని తెలిపారు.

బాధితురాలి రాతపూర్వక, మౌఖిక ఫిర్యాదుల్లో వ్యత్యాసాలుండటాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు ఆధారాలు లేవని పేర్కొన్న కింది కోర్టు.. అదే ఆరోపణపై శిక్ష వేయడం సరికాదని అన్నారు.

కేవలం నాలుగు గోడల మధ్య బాధితురాలు చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని విధించిన జైలు శిక్షను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.