అక్షరటుడే, భిక్కనూరు: Group 2 | తెయూ సౌత్ క్యాంపస్ (TU South Campus) డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన సెకండియర్ విద్యార్థిని శ్రీజారెడ్డి (Srija Reddy) గ్రూప్–2లో ర్యాంక్ సాధించింది. ఈ మేరకు ఆదివారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ర్యాంకు సాధించి ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగానికి (Excise SI Job) ఎంపికైంది.
శ్రీజారెడ్డి స్వస్థలం కరీంనగర్ కాగా.. తల్లిదండ్రులు రాధిక– జైపాల్‌రెడ్డి. శ్రీజారెడ్డి ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లోనూ ర్యాంక్ సాధించి ఎంపీడీవోగా ఎన్నికయ్యారు. ఒకేసారి రెండు ప్రభుత్వ కొలువులు సాధించడంతో వర్సిటీ వీసీ టి.యాదగిరిరావు (University VC T Yadagiri Rao), రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆర్.సుధాకర్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే, అద్భుత ఫలితాలు సాధించవచ్చని శ్రీజారెడ్డి నిరూపించిందన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.