అక్షరటుడే, వెబ్డెస్క్: TET Schedule | తెలంగాణ టెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు. టెట్ ఎగ్జామ్స్ (TET Exams) జనవరి 3 నుంచి జనవరి 20 వకు జరగనున్నాయి.
రాష్ట్రంలో టెట్ పరీక్ష (TET examination) కోసం ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. తొలి సెషన్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2–4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయి. 1–5 తరగతులకు బోధించే వారికి పేపర్–1, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
TET Schedule | పరీక్ష వివరాలు..
జనవరి 3, 4 తేదీల్లో మ్యాథ్స్ పేపర్ పరీక్ష జరగనుంది. 5, 6 తేదీల్లో సోషల్ స్టడీస్ పేపర్ పరీక్ష ఉంటుంది. 8, 9, 11 తేదీల్లో పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. 19న పేపర్ 1 (మైనర్) పరీక్ష.. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిల్, ఉర్దూ, మరాఠీ మీడియంలో నిర్వహిస్తారు. 20న మొదటి సెషన్లో పేపర్ 2 (మైనర్) పరీక్ష.. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో ఉంటుంది.