HomeతెలంగాణTET Schedule | టెట్​ షెడ్యూల్​ విడుదల

TET Schedule | టెట్​ షెడ్యూల్​ విడుదల

విద్యాశాఖ అధికారులు టెట్​ షెడ్యూల్​ విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 29 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : TET Schedule | రాష్ట్రంలో టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)​ షెడ్యూల్​ వెలువడింది. ఈ మేరకు టీజీ టెట్ -2026 షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ శుక్రవారం విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.

ఈ నెల 15 నుంచి 29 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 2026 జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు టెట్​ పరీక్షలు జరుగుతాయి. సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు సార్లు టెట్​ నిర్వహించాలని నిర్ణయించింది. గత డిసెంబర్​లో టెట్​ పరీక్షను నిర్వహించింది. జూన్​లో మరోసారి పరీక్షలు పెట్టింది. తాజాగా మరోసారి షెడ్యూల్​ విడుదల చేసింది. ఈ మేరకు టీజీ టెట్​ ఛైర్​పర్సన్​ నవీన్​ నికోలస్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Must Read
Related News