HomeUncategorizedTS TET | టెట్​ హాల్​ టికెట్లు విడుదల

TS TET | టెట్​ హాల్​ టికెట్లు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: TS TET | తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు సార్లు టెట్​ నిర్వహిస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్​లో టెట్​ పరీక్ష జరగ్గా.. తాజాగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్‌ 18 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా పరీక్ష హాల్​టికెట్లను(Hall Tickets) విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

TS TET | రెండు సెషన్లలో పరీక్షలు

టెట్​ అభ్యర్థులు తమ జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

టెట్​ పరీక్ష పేపర్​–1, పేపర్​–2 విధానంలో నిర్వహిస్తారు. పేపర్​ –1 ఎస్జీటీ అభ్యర్థుల కోసం, పేపర్​–2 స్కూల్​ అసిస్టెంట్​ అభ్యర్థులకు ఉంటుంది. జూన్ 18, 19 తేదీల్లో పేపర్–2 మ్యాథ్స్(Maths), సైన్స్ ఎగ్జామ్స్(Science Exams)​ నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్‌‌‌‌‌‌–1 పరీక్షలు ఉంటాయి. జూన్ 24న పేపర్–2తో పాటు పేపర్–1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27న పేపర్–1 పరీక్ష, జూన్ 28 నుంచి 30 వరకు పేపర్–2 (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.

TS TET | 1,83,653 మంది దరఖాస్తు

ఈ సారి టెట్​ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1 కోసం 63,261 మంది, పేపర్‌-2కు 1,20,392 మంది అప్లయ్​ చేశారు. టెట్​ ఫలితాలను(TET results) జూలై 22న విడుదల చేయనున్నారు. టెట్​ పరీక్ష కంప్యూటర్​ బేస్​డ్ టెస్ట్​ (CBT) విధానంలో జరుగుతుంది. తాజాగా హాల్​ టికెట్లు విడుదల చేసిన అధికారులు పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.