ePaper
More
    HomeతెలంగాణTET Exam | టెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

    TET Exam | టెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TET Exam | తెలంగాణ టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (TET) పరీక్షల షెడ్యూల్​ విడుదలైంది. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సార్లు టెట్​ నిర్వహిస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా డిసెంబర్​లో టెట్​ పరీక్ష(TET Exam) నిర్వహించారు. మళ్లీ టెట్​ కోసం దరఖాస్తులు తీసుకోగా.. తాజాగా పరీక్షల షెడ్యూల్​ను విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్‌ల్లో టెట్​ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

    TET Exam | రెండు పేపర్లు

    టెట్​ పరీక్ష పేపర్​–1, పేపర్​–2 విధానంలో నిర్వహిస్తారు. పేపర్​ –1 ఎస్జీటీ అభ్యర్థుల కోసం, పేపర్​–2 స్కూల్​ అసిస్టెంట్​ అభ్యర్థలకు ఉంటుంది. మొత్తం 16 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్(Maths), సైన్స్ ఎగ్జామ్స్(Science Exams)​ నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. జూన్ 24న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27న పేపర్ 1 పరీక్ష, జూన్ 28 నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.

    TET Exam | 1,83,653 మంది దరఖాస్తు

    ఈ సారి టెట్​ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1 కోసం 63,261 మంది, పేపర్‌-2కు 1,20,392 మంది అప్లై చేశారు. టెట్​ ఫలితాలను(TET results) జూలై 22న విడుదల చేయనున్నారు. టెట్​ పరీక్ష కంప్యూటర్​ బేస్​డ్ టెస్ట్​ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. దీంతో అధికారులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే హాల్​ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

    Latest articles

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    More like this