Homeబిజినెస్​Tesla Y SUV | భారత్​లో లాంచ్​ అయిన టెస్లా తొలి ఎలక్ట్రిక్​ కారు ఇదే.....

Tesla Y SUV | భారత్​లో లాంచ్​ అయిన టెస్లా తొలి ఎలక్ట్రిక్​ కారు ఇదే.. ఫీచర్స్​ అదుర్స్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tesla Y SUV | ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా (Tesla) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్‌ కారు (Electric car)ను విడుదల చేసింది. టెస్లా వై ఎస్‌యూవీ మోడల్‌ (Tesla Y SUV Model)ను మంగళవారం ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేఎస్‌)లో ఏర్పాటు చేసిన తొలి షోరూమ్‌లో ప్రదర్శించింది. ఇది మన దేశంలో కియా(Kia) ఈవీ6, హ్యుందాయ్‌ ఐయోనిక్‌5, బీఎండబ్ల్యూ 14, బీవైడీ సీల్‌ వంటి మోడళ్లతో పోటీపడుతుందని భావిస్తున్నారు. టెస్లా కార్ల బుకింగ్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ కారు ఫీచర్లు తెలుసుకుందామా..

డిజైన్‌: స్లీక్‌, గ్రిల్‌ రహిత డిజైన్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌(LED headlights), కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్స్‌, స్లోపింగ్‌ కూపే స్టైల్‌ రూఫ్‌లైన్‌. మినిమలిస్టిక్‌ డిజైన్‌, 15.4 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వెనుక సీట్ల కోసం 8 inch ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌, 360 డిగ్రీ అకౌస్టిక్‌ గ్లాస్‌, ఫోల్డబుల్‌ రియర్‌ సీట్లు. 19 ఇంచ్‌ అల్లాయ్‌ వీల్స్‌ (రేంజ్‌ను ఆప్టిమైజ్‌ చేయడానికి) అమర్చారు.

Tesla Y SUV | టెక్నాలజీ..

ఆటోపైలట్‌: ట్రాఫిక్‌ అవేర్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, ఆటోమెటిక్‌ పార్కింగ్‌ వంటి లెవల్‌ 2 ఏడీఏఎల్‌ ఫీచర్లున్నాయి.

ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌: ఆప్షనల్‌ అప్‌గ్రేడ్‌గా ఇది అందుబాటులో ఉంది (దీని ధర రూ. 6 లక్షలు అధికం).

ఇతర ఫీచర్లు: 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌, ప్రీమియం సౌండ్‌ సిస్టమ్‌ (17 స్పీకర్లు, 2 సబ్‌వూఫర్లు), ఓటీఏ (ఓవర్‌ ది ఎయిర్‌) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఉన్నాయి. టెస్లా సూపర్‌ చార్జర్‌ ద్వారా 15 నిమిషాల్లో 322 కి.మీ. రేంజ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ అవుతుంది.

వేరియంట్స్‌, పర్ఫార్మెన్స్‌: ఇది రెండు వేరియంట్ల(Variants)లో లభిస్తోంది. రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (ఆర్‌డబ్ల్యూడీ) మరియు లాంగ్‌ రేంజ్‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ) వేరియంట్లున్నాయి. చైనా సీఎల్‌టీసీ టెస్ట్‌ సైకిల్‌ ప్రకారం ఆర్‌డబ్ల్యూడీ(RWD) వేరియంట్‌ 593 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. ఇది 0-100 కి.మీ/గం వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. ఈ వేరియంట్‌ ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ రూ. 59,89,000 – రూ. 61,07,190.
ఏడబ్ల్యూడీ(AWD) 750 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది. 0-100 కి.మీ/గం వేగాన్ని 4.3 సెకన్లలో చేరుకుంటుంది. ఈ మోడల్‌ ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ రూ. 67,89,000 – రూ. 69,15,190.

ప్రతికూలతలు: టెస్లాకు భారత్‌లో తయారీ యూనిట్‌ లేదు. దీంతో చైనా లేదా జర్మనీ నుంచి కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌ (completely build unit)గా తీసుకువచ్చి విక్రయించనున్నారు. దీనివల్ల 70 శాతం వరకు ఇంపోర్ట్‌ డ్యూటీ పడనుంది. దీంతో ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Must Read
Related News