Homeబిజినెస్​Tesla | భార‌త్‌లోకి టెస్లా ఎంట్రీ.. ముంబైలో తొలి షోరూం ప్రారంభం

Tesla | భార‌త్‌లోకి టెస్లా ఎంట్రీ.. ముంబైలో తొలి షోరూం ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tesla | ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతి గాంచిన టెస్లా భార‌త మార్కెట్లోకి (Indian Market) అధికారికంగా ప్ర‌వేశించింది. ఇండియాలో త‌న తొలి షోరూంను ముంబైలో మంగ‌ళ‌వారం ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లోని మేకర్ మాక్సిటీ మాల్‌ (Maker Maxcity Mall)లో ఏర్పాటు చేసిన కార్ల కంపెనీ షోరూంలో.. అత్య‌ధిక ఆద‌ర‌ణ పొందిన Y మోడల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ కుబేరుడు ఎల‌న్ మ‌స్క్‌(Elon Musk)కు చెందిన టెస్లా తన మోడల్ Y ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో విక్ర‌యాల‌కు ఉంచింది. దీని ధర రూ.60 లక్షలు (సుమారు $70,000).

Tesla | వెల్‌కమ్ టు ఇండియా..

ప్రీమియం ఎల‌క్ట్రిక్ వెహికిల్ కార్ల కంపెనీ టెస్లాకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ (Maharashtra CM Devendra Fadnavis) స్వాగ‌తం ప‌లికారు. ముంబైలో ఏర్పాటు చేసిన కార్ల షోరూంను ఆయ‌న మంగ‌ళ‌వారం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. వెల్‌కం టు ఇండియా అని టెస్లాను ఆహ్వానించారు.

Tesla | రూ.60 ల‌క్ష‌ల‌కు పైగానే..

భార‌త్ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన టెస్లా.. మోడ‌ల్ Y SUV విడుదలతో విక్ర‌యాల‌ను ప్రారంభించ‌నుంది. దీని ధ‌ర రూ.60 ల‌క్ష‌లుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది. లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 68 లక్షలుగా తెలిపింది. అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లో ఈ మోడ‌ల్ ధ‌ర‌లు త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ, దిగుమ‌తి సుంకాల కార‌ణంగా ఇండియాలో రేటు ఎక్కువ‌గానే ఉంది. షాంఘై (చైనా)లోని టెస్లా గిగాఫ్యాక్టరీలో త‌యార‌య్యే మోడల్ Y కార్ల‌ను ఇండియాకు దిగుమ‌తి చేసుకుని ఇక్క‌డ విక్ర‌యించనుంది.