అక్షరటుడే, వెబ్‌డెస్క్:Walkers Association | పహల్గామ్(Pahalgam)లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను(terrorists) పట్టుకుని ఉరిశిక్ష విధించాలని అమరవీరుల పార్క్ వాకర్స్ అసోసియేషన్(Walkers Association) సభ్యులు డిమాండ్ చేశారు. మరణించిన టూరిస్టులకు(tourists) బుధవారం నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న పార్క్‌లో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడిలో గాయపడ్జ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
