అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Masood Azhar | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత్‌లో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) ఆడియోను విడుదల చేసింది.
భారత్‌పై భారీ ఉగ్ర కుట్ర చేస్తామని అందులో మసూద్ అన్నాడు. వేలాది మంది మానవ బాంబర్లు (human bombers) సిద్ధంగా ఉన్నారని, లక్ష్యం కోసం ఆత్మ బలిదానానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో (social media) ఆ ఆడియో వైరల్ అవుతోంది. తన క్యాడర్ బలం గురించి మాట్లాడాడు. వారి సంఖ్య చెబితే ప్రపంచ మీడియాలో కలకలం రేపుతుందని పేర్కొన్నాడు.
Masood Azhar | ఆపరేషన్ సిందూర్‌లో..
ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా భారత్ పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో జైషే మహ్మద్ శిబిరాలు సైతం ఉన్నాయి. భారత దాడుల్లో అజార్ దగ్గరి బంధువులు చాలా మంది మరణించారు. ఈ క్రమంలో తాజా ఆడియో కలకలం రేపుతోంది. భారత దాడులు అనేక ఉగ్రవాద స్థావరాలను శిథిలావస్థకు చేర్చాయి. అజార్ బంధువులలో దాదాపు 10 మంది, అతని సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలు తదితరులు చనిపోయారు. దీంతో భారత్‌పై దాడికి కుట్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ఆడియో ఎప్పుడు రిలీజ్ అయిందనే స్పష్టమైన తేది లేదు. ఉగ్రవాద నియామకాలపై మసూద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారు కార్లు, మోటార్ సైకిళ్లు లేదా విదేశీ వీసాలు వంటి భౌతిక సౌకర్యాలను కోరుకోరని పేర్కొన్నాడు.