HomeUncategorizedEncounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | జమ్మూ కశ్మీర్​లో మంగళవారం ఉదయం ఎన్​కౌంటర్(Encounter)​ జరిగింది. ఈ ఘటనలో లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు(Security forces) మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారికోసం జల్లెడ పడుతున్నాయి. పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత జమ్మూ కశ్మీర్​లో భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి.

పహల్​గామ్​​ దాడికి పాల్పడిన వారితో పాటు మిగతా ఉగ్రవాదుల కోసం నిత్యం సెర్చ్​ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఈ క్రమంలో షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు(Terrorists) ఉన్నారనే సమాచారం మేరకు మంగళవారం ఉదయం బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. బలగాలను చూసిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్​కౌంటర్​ ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సోమవారం రాత్రి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై తమ పోరు ఆగదని చెప్పారు. దీంతో బలగాలు టెర్రరిస్టుల అంతు చూడడానికి జమ్మూ కశ్మీర్​ను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకోవడం గమనార్హం.