HomeUncategorizedJammu kashmir | ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. భారీ మొత్తంలో ఆయుధాల స్వాధీనం

Jammu kashmir | ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. భారీ మొత్తంలో ఆయుధాల స్వాధీనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jammu kashmir | పహల్​గామ్​లో పర్యాటకులపై (Pahalgam Terror Attack) ముష్కరులను పట్టుకునేందుకు జమ్మూకశ్మీర్​లో భద్రతా దళాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్​లోని ఓ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని (Terrorist Hideout) భద్రతాదళాలు గుర్తించి, ధ్వంసం చేశాయి. ఉగ్రవాదుల స్థావరాల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉగ్ర స్థావరాలు ఉన్నాయనే నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా.. ఉగ్రవాదుల స్థావరం బయటపడినట్లు అధికారులు వివరించారు.