అక్షరటుడే, ఇందూరు:Pahalgam Terror Attack | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో పౌరులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని బీజేవైఎం నాయకులు (BJYM leaders) పేర్కొన్నారు. దాడిని ఖండిస్తూ బుధవారం ఆర్ఆర్ చౌరస్తా(RR Chowrastha)లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కార్తీక్, జగదీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Pahalgam Terror Attack | దాడిని ఖండిస్తున్నాం..
అక్షరటుడే, కామారెడ్డి: పహల్గామ్(Pahalgam)లో పౌరులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు(BJYM district president Nandi Venu) అన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా బుధవారం కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, నరేందర్, సంతోష్ రెడ్డి, సురేష్, ప్రవీణ్, మహేష్, రాజేష్, భూమేష్, రాజ గోపాల్, బలమని, గుణేందర్, లక్ష్మిపతి, రవీందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
