Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో దొంగల బీభత్సం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

Nizamabad City | నగరంలో దొంగల బీభత్సం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని ఓ ఆపార్ట్​మెంట్​లో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్​ రోడ్​లోని (Armoor Road) పృథ్వి ఆపార్ట్​మెంట్​లో (Prithvi apartment) ఓ ప్లాట్​లో నివాసముండే మహిళ ఇటీవల హైదరాబాద్​కు (Hyderabad) వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉండడంతో చోరీ జరిగినట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.20,000 నగదు.. 8 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

Nizamabad City | అపార్ట్​మెంట్లలో కరువైన భద్రత..

నగరంలోని అపార్ట్​మెంట్లలో భద్రత ఉంటుంది. సీసీ కెమెరాలు..(CCTV cameras) నైట్​ వాచ్​మెన్​.. ఇలా 24 గంటల పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ దుండగులు అపార్ట్​మెంట్లలోని ప్లాట్లలోకి చొరబడి చోరీలు చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Must Read
Related News