అక్షరటుడే, న్యూఢిల్లీ: Terror attack | దాదాపు పుష్కర కాలం తర్వాత దేశంలో మరోసారి ఉగ్రదాడి terrorist attack చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ బాంబు పేలుడు సంభవించింది.
ఎర్రకోట Red Fort కు సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర గల జంక్షన్ లో ఈ దాడి జరిగింది. కదులుతున్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్న ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు.
25 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. తాజా దాడి నేపథ్యంలో గతంలో జరిగిన ఉగ్ర దాడులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Terror attack | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్..
దేశ విభజన తర్వాత భారత్, పాకిస్తాన్ Pakistan మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ముదిరాయి. ఈ క్రమంలోనే పలుమార్లు ఇరు దేశాల మధ్య యుద్దాలు జరిగాయి.
అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయిన పాకిస్తాన్.. నేరుగా భారత్ తో తలపడలేమని తెలిసి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ ISI ఉగ్రవాద సంస్థలకు నేరుగా మద్దతునిస్తూ పెంచిపోషిస్తోంది.
లష్కరే తొయిబా, జేషే మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలను భారత్ పైకి ఉసిగొల్పుతోంది. ఈ క్రమంలోనే 1980ల కాలం నుంచి మన దేశంలో మొదలైన ఉగ్రదాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ ప్రజాస్వామ్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ పైనా దాడి జరిగింది.
Terror attack | భారత్ పై ఉగ్ర దాడులు
పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాద సంస్థలు గతంలో పలుమార్లు మన దేశంలో దాడులకు తెగబడ్డాయి. ఢిల్లీ Delhi, ముంబై Mumbai, హైదరాబాద్ Hyderabad వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డాయి.
1993లో ముంబై Mumbai వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 1993 మార్చి 12న జరిగిన పేలుళ్లు దేశాన్ని వణికించాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) Bombay Stock Exchange (BSE), ఎయిర్ ఇండియా భవనం వంటి కీలక ఆర్థిక, వాణిజ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 12 చోట్లు పేలుళ్లు చోటు చేసుకోగా, 250 మందికి పైగా మరణించారు. 700 మంది గాయపడ్డారు. ఈ దాడి దేశవ్యాప్తంగా మత విధ్వంసానికి తెర లేపింది.
Terror attack | భారత ప్రజాస్వామ్యంపై దాడి..
దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భావించే పార్లమెంట్ పైనా ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న ఐదుగురు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ పార్లమెంట్ భవనం లోనికి చొచ్చుకెళ్లారు.
ఈ దాడిలో ఐదుగురు పోలీసులు సహా 9 మంది మృతి చెందగా, కనీసం 15 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఈ దాడికి వ్యూహకర్త అయిన ఇస్లామిక్ గ్రూప్ జైష్-ఎ-మొహమ్మద్ సభ్యుడైన అఫ్జల్ గురును 2013లో ఉరి తీశారు.
పార్లమెంట్ Parliament పై దాడి జరిగిన తర్వాత రెండేళ్లకు ముంబైలో మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. 2003 ఆగస్టు 25న గేట్వే ఆఫ్ ఇండియాతో పాటు వజ్రాభరణాల వ్యాపార కేంద్రమైన జవేరీ బజార్ వద్ద బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. 50 మందికి పైగా మరణించగా, 100 మంది గాయపడ్డారు.
సిమి, లష్కరే తోయిబా ఈ దాడులకు తెగబడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ లక్ష్యంగా 2005 అక్టోబర్ 29న దీపావళికి ముందు మరోసారి పేలుళ్లు జరిగాయి. రెండుచోట్ల జరిగిన పేలుళ్లలో 50 మందికి పైగా మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
ఆ తర్వాత జూలై 11, 2006న ముంబైలోని సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని 11 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు జరిగాయి. 189 మంది మృతి చెందగా, 800 మందికి పైగా గాయపడ్డారు.
2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో మరోసారి పేలుళ్లు జరిగాయి. కరోల్ బాగ్లోని గఫర్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్లోని M-బ్లాక్ మార్కెట్ 1లో నిమిషాల వ్యవధిలో ఐదు సమన్వయ బాంబు పేలుళ్లతో ఢిల్లీ దద్దరిల్లింది. 25 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
రంగంలోకి దిగిన భధ్రతా బలగాలు ఐదు బాంబులను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇండియన్ ముజాహిదీన్ ఈ దాడులకు బాధ్యత వహించింది.
Terror attack | హైదరాబాద్ లో పేలుళ్లు..
అభివృద్ధిలో దూసుకుపోతున్న చారిత్రక నగరం హైదరాబాద్ లోనూ పలుమార్లు ఉగ్రదాడులు జరిగాయి. 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబనీపార్కు వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా, 42 మంది చనిపోయారు.
అలాగే, 2013లో దిల్ సుఖ్నగర్ బస్టాండ్ వద్ద జరిగిన స్కూటర్ బాంబు పేలుడులో 18 మందికి పైగా హతమయ్యారు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర సంస్థలే ఈ రెండు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
