అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | కేంద్ర మంత్రివర్గ సమావేశం cabinet meeting ప్రధాని నరేంద్ర మోదీ pm modi అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఇప్పటికే త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. తాజాగా కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్ చర్యలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని భయంతో ఉన్న పాక్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినేట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.