అక్షరటుడే, వెబ్డెస్క్ : SSC Exams | తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వెలువడింది. వచ్చే సంవత్సరం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వార్షిక పరీక్షలు (annual exams) నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వార్షిక పరీక్షల తేదీల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
SSC Exams | పరీక్ష తేదీలు
మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్షలు నిర్వహించనున్నారు. 28న మ్యాథ్స్, ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్, 7న బయోలాజికల్ సైన్స్, 13న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 15న ఒకేషనల్ కోర్స్, ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, 16న ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.