Homeబిజినెస్​Stock market | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఇన్వెస్టర్లలో ఆందోళనలు.. భారీగా పడిపోయిన సూచీలు

Stock market | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఇన్వెస్టర్లలో ఆందోళనలు.. భారీగా పడిపోయిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో భారీగా పడిపోయిన ప్రధాన సూచీలు.. చివరికి కొంత కోలుకున్నా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌(Mid cap) స్టాక్స్‌ మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ఉదయం 29 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 329 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో గరిష్టాలనుంచి 15 వందలకుపైగా పాయింట్లు(Points) నష్టపోయింది. 43 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 119 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత గరిష్టాలనుంచి 519 పాయిట్లు పడిపోయింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 588 పాయింట్ల నష్టంతో 79,212 వద్ద, నిఫ్టీ (Nifty) 207 పాయింట్ల నష్టంతో 24,039 వద్ద స్థిరపడ్డాయి.

Stock market | స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లో భారీ సెల్లాఫ్‌..

గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గానే ఉన్నా భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీనికితోడు ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ తీశాయి. దీంతో ఇన్వెస్టర్లు(Investor) గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొని సూచీలు పడిపోయాయి. కాగా లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌(Large cap stocks)లో కనిష్టాల వద్ద కొనుగోలుదారుల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ కాస్త కోలుకున్నాయి. ఐటీ ఇండెక్స్‌ మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.18 శాతం పడిపోగా.. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు రెండున్నర శాతం క్షీణించాయి.

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 719 లాభాలతో, 3,246 నష్టాలతో ముగియగా.. 119 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 9 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Stock market | టాప్​ Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ -30 ఇండెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ముగియగా 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్‌ 1.36 శాతం, ఇన్ఫోసిస్‌(Infosys) 0.64 శాతం, టెక్‌ మహీంద్రా 0.50 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.46 శాతం పెరిగాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank) స్వల్ప లాభాలతో ముగిశాయి.

Stock market | టాప్​ Losers..

అదానీ పోర్ట్స్‌(Adani ports) 3.61 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.48 శాతం, ఎటర్నల్‌ 3.41 శాతం పడిపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ రెండు శాతానికిపైగా నష్టపోయాయి.