Homeబిజినెస్​Stock Market | మిడిల్ ఈస్ట్​లో టెన్షన్స్.. పడిపోయిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | మిడిల్ ఈస్ట్​లో టెన్షన్స్.. పడిపోయిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market | మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం 704 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సెన్సెక్స్‌(Sensex).. అక్కడినుంచి మరో 228 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 173 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 115 పాయింట్లు పడిపోయింది.. ఆ తర్వాత క్రమంగా సూచీలు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 511 పాయిట్ల నష్టంతో 81,896 వద్ద, నిఫ్టీ(Nifty) 140 పాయింట్ల నష్టంతో 24,971 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో 1,854 కంపెనీలు లాభపడగా 2,204 స్టాక్స్‌ నష్టపోయాయి. 182 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 103 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 85 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

అమెరికా(America) దాడులతో ఇరాన్‌ ఎలా స్పందిస్తుందోనన్న భయాలతో ఉదయం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే ఇరాన్‌కు గల పరిమితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు లేవని మార్కెట్‌ భావిస్తోంది. ఇరాన్‌ హర్మూజ్‌(Hormuz) జల సంధిని మూసివేస్తే చైనాకే ఎక్కువ నష్టం. దీంతో తన మిత్రదేశమైన చైనా(China)కు ఇబ్బందిపెట్టే చర్యలను ఇరాన్‌ చేపట్టకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట్లో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు ఆ తర్వాత తర్వాత నెమ్మదించాయి. ఇది భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరటనిచ్చే అంశం. దీంతో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి.

Stock Market | ఐటీ, ఆటోలో సెల్లాఫ్‌..

ఐటీ, ఆటో షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(IT index) 1.48 శాతం పడిపోగా.. ఆటో సూచీ 0.88 శాతం నష్టపోయింది. ఎఫ్‌ఎంసీజీ 0.62 శాతం, టెలికాం 0.50 శాతం, బ్యాంకెక్స్‌ 0.38 శాతం పడిపోయాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.94 శాతం, మెటల్‌ 0.71 శాతం, పీఎస్‌యూ 0.54 శాతం, ఇన్‌ఫ్రా 0.31 శాతం లాభపడ్డాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.57 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.20 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.42 శాతం నష్టపోయాయి.

Top gainers:బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో జీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌(Zee entertainment) 11.55 శాతం, చెన్నై పెట్రో 11.28 శాతం, ఐడియా ఫోర్జ్‌ 10 శాతం, కాఫీ డే 9.87 శాతం, సుప్రీం పెట్రో కెమికల్స్‌ 8.97 శాతం పెరిగాయి.

Top losers:ఎల్టీ ఫుడ్స్‌(LT foods) 6.2 శాతం, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ 5.08 శాతం, స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ 4.93 శాతం, సూర్య రోష్ని 4.4 శాతం, సీమెన్స్‌ 3.91 శాతం నష్టపోయాయి.

Must Read
Related News