ePaper
More
    Homeక్రీడలుUppal Stadium | ఉప్పల్‌ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

    Uppal Stadium | ఉప్పల్‌ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uppal Stadium | హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం (Uppal Stadium) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం స్టేడియంలో హెచ్​సీఏ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 173 క్రికెట్​ క్లబ్స్​ సెక్రెటరీలకు (173 Cricket Clubs Secretaries) మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రెటరీలకు అనుమతి లేదని హెచ్​సీఏ ప్రకటించింది.

    ఇతర క్లబ్​లతో పాటు తెలంగాణ క్రికెట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (Telangana Cricket Joint Action Committee) సభ్యులు భారీగా తరలి వచ్చారు. అయితే ముందుగానే పోలీసులు స్టేడియం వద్ద భారీగా మోహరించారు. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రెటరీలను మాత్రమే లోనికి పంపించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమలో తెలంగాణ క్రికెట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు లోనికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    READ ALSO  Harbhajan Singh | నువ్వు మా నాన్న‌ని కొట్టావు.. నీతో మాట్లాడ‌న‌ని అన్న శ్రీశాంత్ కుమార్తె

    Uppal Stadium | 300 క్లబ్​లకు అనుమతి ఇవ్వాలి

    ప్రస్తుతం 173 క్లబ్​ల సెక్రెటరీలకు మాత్రమే సమావేశంలోని అనుమతించారు. అయితే టీసీ జాక్​ నాయకులు (TC Jack Leaders) భారీగా తరలి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కొత్తగా 300 క్లబ్​లకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. TCJAC నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    కాగా.. ఇటీవల హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్​మోహనరావు (HCA President Jagan Mohan Rao)తో పాటు పలువురి సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్న హెచ్​సీఏ బోర్డుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల క్రికెట్​ బోర్డులు క్రీడాకారులను తయారు చేస్తుంటే.. హెచ్​సీఏ సభ్యులు (HCA Members) మాత్రం రాజకీయాలు, అక్రమాల్లో బిజీగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమాలు పాల్పడిన హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్మోహన్​రావుతో పాటు పలువురిని సీఐడీ ఇటీవల కస్టడీకి తీసుకుంది. వారి అరెస్ట్​ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఉద్రిక్తంగా మారడ గమనార్హం.

    READ ALSO  Virat Kohli | రిటైర్ అయినా సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో త‌గ్గేదే లే..

    Latest articles

    Maharashtra | మ‌హిళా రిసెప్ష‌నిస్ట్‌పై రోగి బంధువు దాడి.. అలాంటోడిని వ‌ద‌లొద్దు అంటూ జాన్వీ క‌పూర్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ...

    Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు....

    Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన...

    Double Bedroom Houses | దీపావళిలోపు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: Double Bedroom Houses |  అర్బన్ నియోజకవర్గంలో దీపావళి (Diwali) లోపు 3,500 ఇళ్లను మంజూరు...

    More like this