అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP Protest | తెలంగాణ సచివాలయం దగ్గర శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నగరంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌తో ‘సేవ్ హైదరాబాద్'(Save Hyderabad) పేరిట బీజేపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. సచివాలయం ముట్టడించడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు.
దీంతో సెక్రెటేరేట్ (Secretariat) దగ్గర భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ సమస్యలు (Drainage Problems), గుంతల రోడ్లు, ఇటీవల విద్యుత్ తీగలు తగిలి పలువురి మృతి చెందడం వంటి సమస్యలపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. జీహెచ్ఎంసీ (GHMC), జలమండలి, హైడ్రా మధ్య సమన్వయం లేకపోవడంతో నగరంలో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సేవ్ హైదరాబాద్ పేరిట సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది.
BJP Protest | అడ్డుకున్న పోలీసులు
బీజేపీ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. సచివాలయం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు కార్యకర్తలు సచివాలయం గేటు ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.
BJP Protest | బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును (BJP State President Ramchandra Rao) సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో మొయినాబాద్ దగ్గర ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP Protest | ఖండించిన ఈటల
సచివాలయం దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) ఖండించారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.