అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు(BJP Leaders) కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators), నేతలు భారీగా తరలివచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్(GHMC Office) దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు(Hyderabad Police) అడ్డుకోవడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన గేటు ముందు బైఠాయించి బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.