అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | తమిళనాడులోని మధురై (Madurai) సమీపంలో గల తిరుప్పరంకుండ్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపై దీపం వెలిగించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
తిరుప్పరంకుండ్రం (Thirupparankundram)లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొట్టై వీధి నివాసులు కొండపై సాంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని నిరసనలు తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సికిందర్ దర్గా (Sikandar Dargah)లో సంతనకూడు ఉత్సవ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సమయంలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
Tamil Nadu | దీపం కోసం..
కొండ ప్రవేశ ద్వారం సుమారు 20 మంది వ్యక్తులు దర్గాకు వెళ్లే మార్గాన్ని అడ్డుకున్నారు. కొండ ఎక్కి దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇది స్థానిక సంప్రదాయంలో భాగమని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ నాయకుడు హెచ్. రాజా కొండ (BJP Leader H. Raja Konda) వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది. తిరునగర్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై రాజా మాట్లాడుతూ.. ఈ సమస్యను మతాల మధ్య ఘర్షణగా కాకుండా హిందువుల హక్కులను పరిరక్షించే అంశంగా అభివర్ణించారు. ఆలయ ప్రాంగణంలో భాగమైన కల్లాతి చెట్టు సమీపంలో దర్గా జెండాలను ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.
Tamil Nadu | గొడవ ఏమిటంటే?
కొండపై దర్గా ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే అక్కడ ఏళ్లుగా దీపం వెలిగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల దీపం వెలిగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అదే ప్రాంతంలో దర్గా ఉత్సవాల్లో భాగంగా జెండా ఏర్పాటు చేయడానికి పోలీసులు అనుమతించారు. దీపం వెలిగించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.