HomeతెలంగాణHydraa | పాతబస్తీలో ఉద్రిక్తత.. పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు

Hydraa | పాతబస్తీలో ఉద్రిక్తత.. పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hydraa | పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకుపడింది. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. చాంద్రాయణ్​ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేశారు.

దీంతో కూల్చివేతలను పాతబస్తీవాసులు అడ్డుకున్నారు. పొక్లెయిన్​ పైకి ఎక్కి, దాని ముందు పడుకుని నిరసన తెలిపారు. వారిని వారించేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Must Read
Related News