అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Forest Land | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట(Dammanapeta)లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీలు అటవీ ప్రాంతంలో వేసుకున్న గుడిసెలను ఫారెస్ట్ అధికారులు తొలగిస్తున్నారు.
దండేపల్లి మండలం(Dandepalli Mandal) లింగాపూర్ అటవీ బీట్‌లో పరిధిలో దమ్మన్నపేట, మామిడిగూడకు చెందిన కొందరు గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలిసి అధికారులు శుక్రవారం దమ్మనపేట్ వెళ్లి గుడిసెలు వేసుకోవడం తప్పని చెప్పారు. వాటిని తొలగిస్తామన్నారు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారుల(Forest Officers)పై దాడులకు పాల్పడ్డారు. సిబ్బంది కళ్లలో కారం కొట్టి గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ, బీట్ అధికారి పరమేశ్వర్, బేస్‌క్యాంప్ వాచర్ రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సిబ్బంది దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Forest Land | భారీ బందోబస్తు మధ్య..
అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకోవడమే కాకుండా.. సిబ్బందిపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగించడానికి శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య తరలివచ్చారు. 300 మంది ఫారెస్ట్ సిబ్బంది(Forest Staff), 200 మంది పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో వేసిన గుడిసెలను జేసీబీల సాయంతో తొలగించారు.
Forest Land | రైతుల వాగ్వాదం
అటవీ ప్రాంతంలోని గుడిసెలు, పోడు పంటలను తొలగించారు. మూడు జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోడు రైతులు అటవీ శాఖ అధికారులతో తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది ఆదివాసీ మహిళలను సైతం అదుపులోకి తీసుకున్నారు.