అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి. గత ఫిబ్రవరిలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. సీనియర్లు, జూనియర్లు వీధి రౌడీల్లా తన్నుకున్నారు. దాడి చేసుకున్నారు.
తాజాగా మరో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు, బయటి వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. బయటివారిని అదుపులోకి తీసుకున్నారు.
Kakatiya University | పోలీసు వాహనం అడ్డగింత..
కాగా, వరంగల్ Warangal కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసు వాహనాలను విద్యార్థులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ Vice Chancellor కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
ఈ ఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యా కుసుమాలతో ప్రశాంతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయం గొడవలకు నెలవంగా మారింది. కొందరు విద్యార్థుల వల్ల మిగతా విద్యార్థలు భయం భయంగా గడపాల్సిన దుస్థితి నెలకొంది.